హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, సోమవారం సాయంత్రం అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్‌నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్లపై వరద నీరు నిలిచిన విషయం తెలిసిందే.