ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తాం: ఎంపీ
KDP: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలోని స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 50 మంది నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.