ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ASF: బెజ్జూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కేక్‌కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. గోల్కొండలోని బేతేలు ప్రార్థన మందిరంలో పాస్టర్ అలువాల లజారుస్ క్రీస్తు పుట్టుక, బోధనలను వివరించారు.