రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ సీఎంకు వినతి
KDP: విజయవాడలో జరిగిన ప్రజా దర్బార్‌లో అన్నమయ్య జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని లేదా ఒంటిమిట్ట–సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని ఒంటిమిట్ట నేతలు గురువారం CM చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఒంటిమిట్ట నుంచి కడపకు 20 కి.మీ. దూరమే ఉండగా, రాయచోటికి 102 కి.మీ. ప్రయాణం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందని వివరించారు.