విమ్స్‌లో రాజ్యాంగ దినోత్స‌వం

విమ్స్‌లో రాజ్యాంగ దినోత్స‌వం

VSP: విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్)లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే. రాంబాబు సెమినార్ హాలులో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రి అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదువుతూ.. ప్రతిజ్ఞ చేయించారు.