చివ్వెంల సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ ఏర్పుల కళ్యాణి నాగేష్ గెలుపు
SRPT: చివ్వెంల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏర్పుల కళ్యాణి నాగేష్ విజయం సాధించారు. స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆమెకు బీఆర్‌ఎస్ శ్రేణులు అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు