సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు

సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి  గల్లంతు

NLG: నాగార్జునసాగర్ కాలువలో వ్యక్తి గల్లంతైన ఘటన మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు సమీపంలో ఇవాళ జరిగింది. చౌగాని శంకర్ (38)తో పాటు మరో ఇద్దరు గ్రామ సమీపంలోని ఎడమ కాలువకు ఈతకు వెళ్లారు. శంకర్ ప్రమాదవశాత్తు కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.