సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో
ప్రకాశం: మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం గ్రామ సచివాలయాన్ని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం నిర్వహించిన ఈ తనిఖీలో సచివాలయ హాజరు పట్టికలు, ఇతర రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు.