త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తా: కార్పోరేటర్

RR: BN రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీ నూతన కమిటీ సభ్యులు కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్‌ను కోరారు. దీంతో స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.