భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హతం
అల్లూరి: మారేడుమిల్లి టైగర్ జోన్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇవాళ ఉదయం 6-7 గంటల సమయంలో పోలీసులు-మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు అతడి భార్య ఉన్నట్లు సమాచారం. కాగా హిడ్మాపై రూ.కోటి, అతడి భార్యపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది.