ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: CM
AP: రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సమీక్షలో.. రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం జరగకుండా, 2 రోజుల్లోపు చెల్లింపులు జరిగేలా చూడలన్నారు. వర్ష సూచన నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని పేర్కొన్నారు.