పీఎం ఇంటర్న్ షిప్ దరఖాస్తు గడువు పెంపు

NLG: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు ఇస్తారని,12 నెలల ఇంటర్న్ షిప్ సమయంలో 6 నెలల ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. pminternship.mca.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.