రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పెట్ సంగం విద్యార్థులు
KMR: రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలకు ZPHS పాఠశాల పెట్ సంగంకు చెందిన ముగ్గురు విద్యార్థినిలు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు. ఈ నెల 24న NZB జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో జరిగిన ఎంపిక పోటీలో అద్భుత ప్రతిభ చాటిన దివ్య శ్రీ, దీపికా, అమ్ములు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET లక్ష్మణ్ తెలిపారు.