బండారుపల్లి రహదారి మూసివేత..

MLG: జిల్లా కేంద్రంలోని బండారుపల్లి శివారులో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రహదారిపై వరద నీరు ప్రవహిస్తోందని పోలీసులు ఇవాళ తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణాలను నిలిపివేశారు. భూపాలపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు జంగాలపల్లి వద్ద డైవర్షన్ తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.