షాద్‌నగర్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

RR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందేబాబయ్య ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ స్టేషన్ రోడ్‌లోని ప్రతి దుకాణానికి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడు తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన కోరారు.