యువత డ్రగ్స్ జోలికి వెళ్ళవద్దు: కలెక్టర్
BDK: జిల్లాలో 'చైతన్యం - డ్రగ్స్‌పై యుద్ధం' కార్యక్రమంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లా పోలీసు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, డీఎస్‌వో కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.