ఆరోగ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత
MNCL: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చని తెలిపారు.