తాళ్లవలస సంఘటన పై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
SKLM: సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో గ్రామంలో డయేరియాతో ఒకరు చెందడం, పలువురు భారీన పడిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఆరా తీశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య బృందాలను పంపించి శిభిరం ఏర్పాటు చేసి, పారుశుద్యం కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.