VIDEO: పందుల బెడదపై ప్రజల ఆందోళన

GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలో పందుల బెడద ఎక్కువైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా చెత్తాచెదారం, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని తెలిపారు. దీనివల్ల దుర్వాసన, దోమల వ్యాప్తి పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే అధికారులకు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.