కర్ణాటక గవర్నర్‌తో సత్యసాయి ట్రస్ట్‌ సభ్యుల భేటీ

కర్ణాటక గవర్నర్‌తో సత్యసాయి ట్రస్ట్‌ సభ్యుల భేటీ

సత్యసాయి: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలు ఎస్ఎస్ నాగనంద్, ఐఎస్ఎన్ ప్రసాద్ ఇతర సభ్యులతో కలిసి కర్ణాటక గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌ను ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్‌కు ఆహ్వానం అందించారు. ట్రస్ట్ చేపడుతున్న వివిధ మానవతా, విద్య, వైద్య సేవలను ఆయనకు వివరించారు.