'రేపు బాటనీ, జువాలజీ అధ్యాపకులు రిపోర్ట్ చేయాలి'
ADB: ఇంటర్ పేపర్ మూల్యాంకనం కోసం బాటనీ, జువాలజీ అధ్యాపకులు ఈనెల 17న ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని డీఐఈవో గణేష్ జాదవ్ తెలిపారు. మూడో విడతలో జరగాల్సిన ఈ సబ్జెక్టుల మూల్యాంకనాన్ని 17వ తేదీకి మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధ్యాపకులు ఈ మార్పును గమనించి విధులకు హాజరుకావాలని ఆయన సూచించారు.