రైతులకు రూ. 2,148 కోట్లు రుణ సాయం : ఎమ్మెల్యే

రైతులకు రూ. 2,148 కోట్లు రుణ సాయం : ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా రూ. 2,148 కోట్లు రుణాలు ఇవ్వనున్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఇందులో రూ.1,140 కోట్లు పంట రుణాల కోసం, మిగిలిన రూ. 1,008 కోట్లు వ్యవసాయ సంబంధిత రంగాల కోసం కేటాయించినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ.472 కోట్లు అధికమని పేర్కొన్నారు.