గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

SRPT: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని పర్సాయిపల్లి, అర్వపల్లి, కాసర్లపహాడ్, అడివెంల, తిమ్మాపురం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని పేర్కొన్నారు.