జిల్లాలో 9 గంటల వరకు 23.94% పోలింగ్ నమోదు
PDPL: జిల్లాలో గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1,12,658 మంది ఓటర్లలో 26,965 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 23.94%గా నమోదైంది. అంతర్గాం మండలంలో 24.98 శాతం, ధర్మారం 26.66 శాతం, జూలపల్లి 23.90 శాతం, పాలకుర్తి 19.18 శాతం పోలింగ్ జరిగింది.