గుర్తు తెలియని బాలుడు మృతి

KRNL: ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామ సమీపంలోని ఎస్ఎస్ ట్యాంకు కాలువలో ఈతకు దిగి ఊపిరాడక గుర్తు తెలియని బాలుడు మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. బాలుడి వివరాలు తెలిసిన వారు ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు తెలియజేయాలని వారు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ను 9121101148 నంబర్ ద్వారా సంప్రదించి వివరాలు తెలపాలని పోలీసులు వివరించారు.