గణపతి మండపాల వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు

MBNR: మహబూబ్ నగర్‌లోని గణపతి మండపాల వద్ద పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం డాగ్ స్క్వాడ్ సిబ్బందితో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వన్ టౌన్ ఎస్సై సక్రి పర్యవేక్షణలో భద్రతను పర్యవేక్షించారు. ఈ తనిఖీలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.