సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిని కాలనీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, తదితరులు కలిశారు. ఛత్రపతి హిల్స్ కాలనీలో నెలకొన్న సమస్యలను వివరిస్తూ పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. దశలవారీగా కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.