EAPCETకు షాక్.. తగ్గిన అప్లికేషన్లు
TG: EAPCET-2026 దరఖాస్తు ప్రక్రియ ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 4తో ముగిసింది. ఈ ఏడాది మొత్తం 2,89,974 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగం నుండి 2,03,167 మంది, అగ్రికల్చర్&ఫార్మసీ విభాగం నుండి 86,523 మంది ఉన్నారు. రెండు విభాగాలకు కలిపి 284 మంది దరఖాస్తు చేశారు. గతేడాది దరఖాస్తుల సంఖ్య 3.07 లక్షలుగా ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం.