'అమరావతి ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు'

AP: మాజీ CM జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అందరికి తెలుసని మంత్రి ఆనం నారాయణ రెడ్డి అన్నారు. 'తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఉండాలి. తప్పు చేసి ఇంకొకరిపై నెట్టడం జగన్‌కు అలవాటు. ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు. భగవంతుడు, హిందూ ధర్మం వంటి ఆచారాలను వైసీపీ రాజకీయ వైకుంఠపాళిలోకి లాగుతోంది. అమరావతి ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు' అని వ్యాఖ్యానించారు.