VIDEO: పిట్లంలో కోతుల గుంపులతో తిప్పలు
KMR: పిట్లం మండల కేంద్రంలో కోతుల గుంపులు హల్‌చల్ చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, పిల్లలు, వృద్ధులపై దాడికి దిగుతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రహదారులపై కోతులు తిష్ట వేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అటవీ శాఖ అధికారులు స్పందించి కోతులను బంధించి అడవిలో విడిచిపెట్టాలన్నారు.