షార్ట్ సర్క్యూట్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే
VSP: కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.