ఫుట్ పాత్ అక్రమణలు తొలగింపు

HYD: ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్‌లో ఫుట్‌పాత్‌పై నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన పలు దుకాణాలను కాప్రా మున్సిపల్ అధికారులు తొలగించారు. కూల్చివేతలను ఆయా దుకాణాల నిర్వాహకులు అడ్డుకున్నప్పటికీ అధికారులు వాటిని జేసీబీలతో కూల్చివేశారు. ఫుట్‌పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అధికారులు తెలిపారు. నిర్మాణాలన్ని నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయన్నారు.