బాలుడిని తన్నిన గుర్రం.. చికిత్స పొందుతూ మృతి
వరంగల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖిలా వరంగల్‌లోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో గుర్రం తన్నడంతో గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివనగర్ పాడి మల్లారెడ్డినగర్‌కు చెందిన గౌతం(12) ఈనెల 10న పార్క్‌కు వెళ్లగా, పర్యాటకుల సవారీ కోసం ఉంచిన గుర్రం కడుపులో తన్నింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.