రంగా వర్సిటీ వీసీగా 'ఆంధ్ర రైస్ మ్యాన్'
గుంటూరు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సిలర్‌గా డాక్టర్ పాలడుగు సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వర్సిటీ పరిశోధన సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, వరి వంగడాల అభివృద్ధిలో ఈయన అందించిన కృషికి గాను 'ఆంధ్ర రైస్ మ్యాన్'గా గుర్తింపు పొందిన విషయం విదితమే.