CMRF చెక్కులను పంపిణీ చేసిన ఇంఛార్జ్
ఖమ్మం జిల్లాలో 46వ డివిజన్‌కు చెందిన జాడి లక్ష్మీ రూ.26,500, జ్యోతిలకు రూ.20,000 విలువ గల CMRF చెక్కులు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సిఫారసుతో మంజూరయ్యాయి. ఈ చెక్కులను డివిజన్ ఇంఛార్జ్ బాణాల లక్ష్మణ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల వైద్య ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.