బ్యాంకులో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉద్యోగులు

బ్యాంకులో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉద్యోగులు

TG: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగులు మద్యం పార్టీ చేసుకున్నారు. PACS ఛైర్మన్ కార్యాలయంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 వరకు మద్యం సేవించారు. మందు పార్టీలో మోత్కూరు సింగిల్ విండో కార్యాలయ ఉద్యోగులు, నల్గొండ గ్రామీణ సహకార బ్యాంకు, మోత్కూరు ఉద్యోగులు పాల్గొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.