బాపట్లలో తప్పిన ప్రమాదం.. అధికారుల తీరుపై ఆగ్రహం
BPT: బాపట్ల మున్సిపల్ ఆఫీస్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి మూతలు లేని కాలువలో పడిపోగా, స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. మూతలు లేని కాలువలతో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని జనం మండిపడుతున్నారు. తక్షణమే కాలువలకు మూతలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.