దామరంచ గ్రామాన్ని సందర్శించిన నూతన ఎంపీడీవో
KMR: బీర్కూర్ మండలం నూతన ఎంపీడీవో శ్రీనిధి శనివారం దామరంచ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆమె జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పని సూచనలు తెలియజేశారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పోషకహారాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యత, రికార్డులను హాజరు వివరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అక్మాల్ ఉన్నారు.