భారీ వర్షాలతో అన్నదాతల ఆందోళన
KDP: దువ్వూరు మండలం పరిధిలోని చిన్న సింగనపల్లి, చల్ల బసయపల్లి, గొల్లపల్లి, మణిరంపల్లి, గుడిపాడు, మదిరేపల్లి, నీలాపురం గ్రామాల్లో వర్షం కారణంగా పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలోనే పంటలు నీట మునగడంతో మినుములు, వేరుశనగలు వంటి పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.