VIDEO: గ్యాస్ గోడౌన్‌ను తనిఖీ చేసిన అధికారులు..!
KDP: గ్యాస్ సిలిండర్లు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు గ్యాస్ గోడౌన్‌ను పరిశీలించారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక HP గ్యాస్ ఏజెన్సీ వద్దకు ఎన్‌ఫోర్స్‌మెంట్ DT. నరేంద్ర, RI. షేక్షావలి, VROలు వెళ్లి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లి సిలిండర్లను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.