'మెడికల్ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు'
MNCL: ప్రభుత్వాలు వేరైనా కార్మికుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ఒకటేనని CITU నాయకులు విమర్శించారు. కాసిపేట-1 గనిలో బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. మెడికల్ బోర్డుపై కార్మిక సంఘాలను బద్నాం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు రావలసిన బకాయిలపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు.