జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్లు
VZM: జిల్లాలో రూ.170 కోట్లతో తొలి విడతలో 15,018 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 30 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. డెంకాడలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. దీంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభిస్తుందన్నారు.