ఐఎఫ్ఆర్-2026పై కలెక్టర్ సమీక్ష
VSP: ఐఎఫ్ఆర్-2026, మిలాన్, అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ కలిసి ఆయన ఏర్పాట్లపై చర్చించారు. ఫిబ్రవరి 17 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.