ఎంపీడీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
NLG: జిల్లాలో జరగనున్న MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధమైందని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం తెలిపారు. గురువారం నుంచి అక్టోబర్ 11 సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. MPDO కార్యాలయంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఎన్నికల కోడ్, 100 మీటర్ల పరిధి నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు.