రేపు మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
W.G: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు-2025 మంగళవారం నాడు మండల ప్రజా పరిషత్ పెనుమంట్ర సమావేశ మందిరం నందు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎంఈవో ఆఫీస్ పక్కన ఉన్న మండల పరిషత్ బిల్డింగ్ లోని మీటింగ్ హాల్ నందు హాజరు కావాలని కన్వీనర్ సోమవారం తెలిపారు.