ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సౌహార్ద్రం, ఐక్యతను మరింత బలపర్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.