ఘనంగా బాలల దినోత్సవం

ఘనంగా బాలల దినోత్సవం

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని నందనవనం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెహ్రూ గొప్పతనం, బాలల దినోత్సవ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాలకొండయ్య, రంగారావు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.