కేంద్రమంత్రులతో లోకేష్ భేటీ

కేంద్రమంత్రులతో లోకేష్ భేటీ

AP: మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి జయంత్ చౌదరితో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్రమంత్రికి వివరించి.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు సహాయం కావాలని కోరారు.