'ఈ నెల 15 నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు'

VZM: ఈ నెల 15 నుంచి 'స్త్రీ శక్తి పథకం' ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను నడపనున్నట్లు విజయనగరం DPTO జి. వరలక్ష్మి సోమవారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 160 బస్సులు నడుస్తున్నాయని, వాటిలో పల్లెవెలుగు-108, అల్ట్రా పల్లె వెలుగు-7, మెట్రో ఎక్స్‌ప్రెస్-14, ఎక్స్ ప్రెస్-8 మొత్తంగా 137 బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.