రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎస్పీ

రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎస్పీ

SRCL: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ. గీతే పుట్టినరోజు సందర్భంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వీర ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజు కూడా పాల్గొన్నారు. ఆలయ అధికారులు, పూజారులు ఎస్పీకి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.